తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిటైర్మెంట్​పై రాయుడు యూటర్న్​

తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్​ క్రికెట్​ సంఘం పాలక మండలికి లేఖ రాశాడు. మూడు ఫార్మాట్లలో మళ్లీ క్రికెట్​లోకి రావాలనుకుంటున్నట్లు అందులో వెల్లడించాడు.

రిటైర్మెంటుపై రాయుడు యూటర్న్​

By

Published : Aug 30, 2019, 12:49 PM IST

Updated : Sep 28, 2019, 8:38 PM IST

ప్రపంచకప్‌లో ఆడే అవకాశం రాకపోవడం వల్ల తీవ్ర నిరాశ చెందిన రాయుడు... జులైలో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే మళ్లీ అన్ని ఫార్మాట్లలో ఆడాలనుందని హైదరాబాద్​ క్రికెట్​ సంఘానికి(హెచ్​సీఏ) తన అభీష్టాన్ని తెలిపాడు. తనలో ఇంకా క్రికెట్‌ ఆడే సత్తా ఉందని, తిరిగి జట్టులోకి వచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించాడు.

అంబటి రాయుడు

" వీడ్కోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా. అన్ని ఫార్మాట్లో క్రికెట్‌ ఆడాలని అనుకుంటున్నా. కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచి, నాలో క్రికెట్‌ మిగిలి ఉందని నాకు తెలిసేలా చేసిన సీఎస్కే జట్టుకు, మాజీ ఆటగాళ్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, నోయల్‌ డేవిడ్‌లకు ధన్యవాదాలు. క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనే నిర్ణయం భావోద్వేగంతో తీసుకున్నది. హైదరాబాద్‌ తరపున తిరిగి ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా. జట్టు తరఫున పూర్తిస్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాను. వచ్చే నెల 10 నుంచి జట్టుకు అందుబాటులో ఉంటాను ".
--అంబటి రాయుడు, భారత క్రికెటర్​

తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడిస్తూ బీసీసీఐ, హెచ్‌సీఏకు లేఖ రాశాడు రాయుడు. 2019-20 సీజన్‌కు గాను హెచ్‌సీఏ తరపున ప్రాతినిథ్యం వహించేందుకు అందుబాటులో ఉండనున్నాడని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించేందుకు మళ్లీ బ్యాట్​ పట్టనున్నాడు రాయుడు.

Last Updated : Sep 28, 2019, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details