ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగలనుంది. డిసెంబరు 17 నుంచి జరగనున్న తొలి టెస్టుకు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటులో ఉండకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే జరిగిన తొలి టీ20లో జడేజా తలకు బంతి తగిలి అతని స్థానంలో యుజ్వేంద్ర చాహల్ కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.
భారత్‌కు మరో షాక్.. తొలి టెస్టుకు జడేజా దూరం! - ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు జడేజా దూరం
ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశం ఉంది. తొలి టీ20లో తలకు బంతి తగిలిన కారణంగా మైదానాన్ని వీడిన జడేజాకు మరో మూడు వారాలు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
టీమ్ఇండియాకు మరో షాక్.. తొలి టెస్టుకు జడేజా దూరం!
ఈ నేపథ్యంలో జడేజాకు కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తొలి టెస్టుకు జడ్డూ దూరం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. మెల్బోర్న్లో జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకూ జడేజా దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
ఇదీ చూడండి:క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి.. సీన్ రిపీట్ చేస్తారా?
Last Updated : Dec 7, 2020, 6:15 PM IST