ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో బొటనవేలికి గాయమైన కారణంగా విశ్రాంతి తీసుకున్న టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. మైదానంలో రన్నింగ్, జిమ్లో వర్కౌట్లు చేస్తున్న వీడియోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. "సర్జరీ తర్వాత మైదానంలో తొలిరోజు", జిమ్లో కసరత్తులు చేస్తోన్న వీడియోలను పోస్ట్ చేశాడు.
సర్జరీ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టిన జడేజా - india vs australia
బొటనవేలి గాయం నుంచి కోలుకున్న టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వేలికి సర్జరీ తర్వాత శిక్షణను తిరిగి ప్రారంభించినట్లు ట్విట్టర్లో వీడియోలను పంచుకున్నాడు.
సర్జరీ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టిన జడేజా
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో జడేజా బొటనవేలికి గాయమైంది. ఆ తర్వాత అది సర్జరీ దారి తీసింది. దీంతో జడ్డూకు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరుగుతోన్న టెస్టు సిరీస్కు జడేజా పూర్తిగా దూరమయ్యాడు.
ఇదీ చూడండి:ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు జడ్డూ దూరం!