టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. అభిమానుల ప్రశ్నలకు అన్నింటికి సమాధానాలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే 'టెస్టుల్లో ప్రత్యర్థి జట్టులోని టెయిలెండర్లను బౌలర్లు ఎందుకు త్వరగా ఔట్ చేయలేకపోతున్నారు?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, అందుకు గల కారణాన్ని వెల్లడించాడు.
"ఇప్పుడు టెయిలెండర్లు కొత్త వాళ్లలా బ్యాటింగ్ చేయడం లేదు. కాలం మారింది. కావాలనే ఎవరూ వికెట్ సమర్పించుకోవాలని అనుకోరు కదా!"అంటూ అశ్విన్ రీట్వీట్ చేశాడు.
2018 ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్ విషయంలో ఇలానే ఇబ్బంది పడింది భారత్. బ్యాటింగ్ ఆర్డర్ చివర్లో వచ్చిన అతడిని ఔట్ చేసేందుకు చాలా కష్టపడింది మన బౌలింగ్ దళం. దీంతో అతడు, నాలుగు టెస్టుల్లో కలిపి 272 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఆ సిరీస్‌ను 4-1 తేడాతో ఇంగ్లాండ్ గెలుచుకోవడంలో కరన్ కీలకపాత్ర పోషించాడు.
కెరీర్లో 71 టెస్టుల్లో 365, 111 వన్డేల్లో 150, 46 టీ20ల్లో 52 వికెట్లు తీశాడు అశ్విన్. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.