టీమ్ఇండియా పురుషుల జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి.. లాక్డౌన్ సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ సమయంలో కొన్ని ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నాడు. తాజాగా శునకాలతో భౌతిక దూరాన్ని పాటిస్తున్నట్లు ఓ ట్వీట్ చేశాడు. అందులోని మొదటి చిత్రంలో 5 శునకాలు దూరాన్ని పాటిస్తూ అతని చుట్టూ కూర్చున్నాయి. రెండవ ఫొటోలో ఒక శునకం కళ్లజోడు పెట్టుకుని కెప్టెన్లా స్టైల్‌గా నడుస్తోంది.
శునకాలతో భౌతిక దూరం పాటిస్తున్న రవిశాస్త్రి
భారత మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి.. లాక్డౌన్లో తన విలువైన సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ క్రమంలో అతని ఆలోచనలను, జ్ఞాపకాలను సోషల్‌మీడియాలో పంచుకుంటున్నాడు. తాజాగా శునకాలతో భౌతిక దూరం పాటిస్తూ ఉన్న చిత్రాన్ని ట్వీట్ చేశాడు.
శునకాలతో భౌతిక దూరం పాటిస్తున్న టీమ్ఇండియా కోచ్
ఈ విరామ సమయంలో రవిశాస్త్త్రి తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాడు. 1984లో వాంఖడే వేదికగా ఇంగ్లాండ్‌పై తన కెరీర్లో తొలి టెస్టు సెంచరీని నమోదు చేశానని ఇటీవలే గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 323 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 142 పరుగులు సాధించాడు.
ఇదీ చూడండి... నీటిపై బౌన్స్ అయింది.. బ్యాట్స్‌మన్ దిమ్మతిరిగింది