టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి.. తన ఉంటున్న అలీబాగ్ ప్రాంతం రెడ్ నుంచి ఆరెంజ్ జోన్లోకి రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. మద్యం షాపులు తెరిచిన వెంటనే వెళ్లి, బీర్ తెచ్చుకుంటానని అన్నాడు. అక్కడ జనాలు నిబంధనలు పాటించకున్నా.. తాను మాత్రం మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి వాటిని కొనుగోలు చేస్తానని చెప్పాడు.
ఈ సమయంలో అవకాశమొస్తే ఎవరితో కలిసి మందు తాగుతారు? అన్న ప్రశ్నకు సమధానంగా.. మాజీ క్రికెటర్లు రోజర్ బిన్నీ, శివరామకృష్ణన్లతో కలిసి తాగుతానని రవిశాస్త్రి చెప్పాడు.