తెలంగాణ

telangana

ETV Bharat / sports

జట్ల భవిష్యత్తుపై ఆన్​లైన్​లో కోచ్​ల చర్చ

టీమిండియా కోచ్​ రవిశాస్త్రి, భారత్​ 'ఎ' కోచ్​తో సహా ఇతర బీసీసీఐ కోచ్​లు తమ జట్ల భవితవ్యంపై ఆన్​లైన్​లో చర్చించుకున్నారు. కోచ్​లంతా తమ ప్రణాళికలపై మాట్లాడుకున్నారు.

By

Published : May 1, 2020, 7:55 AM IST

Ravi Shastri headlines online session of BCCI coaches
తమ జట్ల భవిష్యత్తుపై ఆన్​లైన్​లో కోచ్​ల చర్చ

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి, భారత్‌ 'ఎ' కోచ్‌, జూనియర్‌ జట్ల కోచ్‌లు తమ తమ జట్ల భవిష్యత్తు గురించి ఆన్‌లైన్‌లో చర్చించుకున్నారు. జాతీయ క్రికెట్‌ అకాడమీ అధిపతి రాహుల్‌ ద్రవిడ్‌ చొరవతో ఈ చర్చ జరిగింది.

భారత జట్టు బౌలింగ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌.. ఎన్‌సీఏ కోచ్‌లు పారస్‌ మాంబ్రే, నరేంద్ర హీర్వాణి, అభయ్‌ శర్మ, సితాంశు శుక్లా కూడా ఇందులో పాల్గొన్నారు. కోచ్‌లంతా కలిసి తమ ప్రణాళికల గురించి చర్చించుకున్నారు. సలహాలు ఇచ్చారు. ఇతరులు చెప్పింది విన్నారు. ఇక నుంచి ఇలాంటి చర్చలు తరచూ జరుగుతాయి’ అని ఓ ఎన్‌సీఏ అధికారి చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details