ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టును 'మన్ కీ బాత్' కార్యక్రమం సందర్భంగా మరోసారి కీర్తించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధాని మాటలు.. ఒత్తిడిలో మరింత రాణించేందుకు దోహదపడతాయన్నారు టీమ్ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి. ట్విట్టర్ వేదికగా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
"ధన్యవాదాలు సార్. మీ స్ఫూర్తిదాయక మాటలు టీమ్ఇండియాను మరింత శక్తిమంతం చేస్తాయి. అలాగే ఒత్తిడిలో సమర్థవంతంగా రాణించేందుకు మరింత బలం చేకూరుస్తాయి. జై హింద్," అని రవిశాస్త్రి ట్వీట్ చేశారు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.