తెలంగాణ

telangana

ETV Bharat / sports

గేల్​కు మొండిచేయి.. రషీద్​ ఖాన్ ఎంపిక - gayle

'ద హండ్రెడ్' లీగ్ తొలి డ్రాఫ్ట్​లోనే అఫ్గాన్ బౌలర్ రషీద్​ఖాన్​ ఎంపికయ్యాడు. ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీ అతడిని తీసుకుంది. విండీస్ వీరుడు క్రిస్​గేల్​ మాత్రం తొలి జాబితాలో ఎంపిక కాలేదు. అతడితో పాటు లసిత్ మలింగనూ తీసుకోలేదు.

రషీద్​ ఖాన్

By

Published : Oct 21, 2019, 2:49 PM IST

ఇంగ్లాండ్ - వేల్స్ క్రికెట్ బోర్డు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోయే టోర్నీ 'ద హండ్రెడ్'. వంద బంతుల ఈ లీగ్​కు ఆఫ్గానిస్థాన్​ క్రికెటర్ రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. తొలి జాబితాలోనే ఈ​ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మొదటి ఆఫ్గాన్​ క్రికెటర్​గా నిలిచాడు. ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీ ఈ బౌలర్​ను తీసుకుంది.

అంతర్జాతీయ క్రికెట్​లో అద్భుతంగా రాణిస్తున్నాడు రషీద్ ఖాన్. టీ20ల్లో 12.03 సగటుతో 81 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా వంద బంతుల టోర్నీ తొలి రౌండ్​లోనే ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.

వెస్టిండీస్ ఆల్​రౌండర్ ఆండ్రీ రసెల్, సదరన్ బ్రేవ్​ తొలి డ్రాఫ్ట్​లోనే ఎంపికయ్యారు. వీరితో పాటు ఆసీస్ ఆటగాడు ఆరోన్​ ఫించ్​ను తీసుకుంది నార్తర్న్ సూపర్ చార్జర్స్ ఫ్రాంచైజీ.

గేల్​కు దక్కని అవకాశం..

అయితే వెస్టిండీస్ విధ్వంసకారుడు క్రిస్​గేల్​ను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అతడి కనీస ధర ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. గేల్​తో పాటు లసిత్ మలింగ, దక్షిణాఫ్రికా పేసర్ కగిసొ రబాడాలను తొలి రౌండ్​లో తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

ఆసీస్ ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​ను లండన్ స్పిరిట్ జట్టు తీసుకోగా.. లియామ్ లివింగ్​స్టన్​ను బర్మింగ్​హామ్ ఫీనిక్స్ ఎంపిక చేసుకుంది. మిచెల్ స్టార్క్​, స్టీవ్ స్మిత్​ను వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ తీసుకుంది.

మిషెల్ స్టార్క్

తొలి రౌండ్​లో ప్రతి ఫ్రాంచైజీ ఇద్దరు ఆటగాళ్లను తీసుకుంది. ఎక్కువగా అంతర్జాతీయ క్రికెటర్ల వైపు మొగ్గుచూపాయి జట్లు. వచ్చే ఏడాది జులైలో ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: వైరల్​: మ్యాచ్ మధ్యలో మైదానంలోకి అభిమాని

ABOUT THE AUTHOR

...view details