బిగ్‌బాష్ లీగ్‌లో ఆఫ్గానిస్థాన్ యువ క్రికెటర్ రషీద్‌ఖాన్ విభిన్నమైన బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. ఒంటె మూపురం ఆకారంలో ఉండే డిజైన్ కలిగిన బ్యాట్‌ను వినియోగించాడు. క్యామెల్ బ్యాట్‌గా పిలిచే ఈ విభిన్నమైన బ్యాట్.. నెట్టింట వైరల్‌గా అవుతోంది.
ఆల్‌రౌండర్ ప్రదర్శన...
ఆదివారం మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అడిలైడ్ స్ట్రైకర్స్ క్రికెటర్ రషీద్‌ఖాన్. బ్యాట్స్‌మన్‌గా 25 పరుగులతో( 16 బంతుల్లో; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అంతేకాకుండా ఫిలిఫ్ సాల్ట్(54), అలెక్స్ కేరీ(41) చక్కటి ప్రదర్శనతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు.