తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైరల్: రషీద్​ఖాన్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్​ - cricket news

బిగ్​బాష్​ లీగ్​లో అడిలైడ్ స్ట్రైకర్స్-బ్రిస్బేన్ హీట్​ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్​లో అఫ్గాన్​ బౌలర్​... రషీద్ ఖాన్ అద్భుత క్యాచ్​ పట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

వైరల్: రషీద్​ఖాన్ మైండ్​ బ్లోయింగ్ క్యాచ్​
అఫ్గానిస్థాన్​ స్పిన్నర్​ రషీద్​ఖాన్

By

Published : Jan 18, 2020, 6:21 AM IST

అఫ్గానిస్థాన్​ స్పిన్నర్​ రషీద్​ఖాన్.. మరోసారి మాయ చేశాడు. ప్రస్తుతం బిగ్​బాష్ లీగ్​ ఆడుతున్న ఇతడు.. అద్భుతమైన క్యాచ్​ పట్టాడు. శుక్రవారం.. అడిలైడ్​ స్ట్రైకర్స్-బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో రన్నింగ్ క్యాచ్​తో క్రిస్​లిన్​(26)ను పెవిలియన్​కు పంపాడు. ఈ వీడియోను సన్​రైజర్స్ హైదరాబాద్​ తన ట్విట్టర్​లో పోస్ట్ చేసింది.

ఈ మ్యాచ్​లో అడిలైడ్​ స్ట్రైకర్స్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. బ్రిస్బేన్ నిర్దేశించిన 101 పరుగుల లక్ష్యాన్ని, 10.5 ఓవర్లలోనే ఛేదించింది. ప్రస్తుత బిగ్​బాష్ సీజన్​​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానంలో ఉన్నాడు రషీద్(15). ఇతడి కంటే ముందు డేనియర్ సామ్స్ 17, హేరిస్ రౌఫ్ 16 ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details