అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్టుల్లో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. 21వ శతాబ్దంలో ఓ టెస్టులో అత్యధిక ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన వాడిగా ఘనత సాధించాడు.
టెస్టుల్లో రషీద్ ఖాన్ క్రేజీ రికార్డు - జింబాబ్వే అప్ఘానిస్థాన్ రెండో టెస్టు
జింబాబ్వేతో రెండో టెస్టులో 99.2 ఓవర్లు బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఆ ఘనత ఏంటంటే?
రషీద్ ఖాన్
అబుదాబి వేదికగా జింబాబ్వే, అప్ఘానిస్థాన్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టుతో ఈ మైలురాయిని రషీద్ ఖాన్ అందుకున్నాడు. ఈ మ్యాచులో రెండు ఇన్నింగ్స్లో 36.3ఓవర్లు(4-138), 62.5 ఓవర్లు(7-137) వేశాడు.
ఇదీ చూడండి: 'అప్పుడు లావుగా ఉండేవాడిని.. ఫిట్నెస్ కోసం శ్రమించా'