ధర్మశాల వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో ముంబయి ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. 199 బంతుల్లో 200 పరుగులు సాధించి మరో ఘనత వహించాడు. సర్ఫరాజ్‌కు వరుసగా ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 301 పరుగులు చేశాడు.
మరో ట్రిపుల్ సెంచరీకి చేరువలో సర్ఫరాజ్ - అజిత్ వడేకర్
ధర్మశాల వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో ముంబయి జట్టుకు చెందిన సర్ఫరాజ్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్‌పై ట్రిపుల్ సెంచరీ చేసి జట్టును పరాజయం నుంచి కాపాడిన ఈ యువ ఆటగాడు.. సోమవారం హిమాచల్‌పై డబుల్ సెంచరీ సాధించి మరోసారి ట్రిపుల్ సెంచరీకి చేరువయ్యాడు.
మరోసారి ట్రిపుల్సెంచరీకి చేరువలో సర్ఫరాజ్
హిమాచల్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబయి 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన సర్ఫరాజ్ జట్టును ఆదుకున్నాడు. తొలిరోజు ఆటముగిసే సమయానికి 213 బంతుల్లో 226 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రెెండో రోజు ఇలాంటి ప్రదర్శనే కనబరిస్తే మరో ట్రిపుల్ సెంచరీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ముంబయి ఐదు వికెట్లు కోల్పోయి 372 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌తో పాటు శుభం రంజనే (44) క్రీజులో ఉన్నాడు.
ఇదీ చూడండి.. ఐపీఎల్: సమయం, ఆఖరి మ్యాచ్ వేదికపై స్పష్టత
Last Updated : Feb 28, 2020, 4:33 AM IST