రంజీ ట్రోఫీ రౌండ్-9 ప్లేట్ గ్రూపులో భాగంగా మణిపూర్-చండీగఢ్ జట్లు తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 609 పరుగులు ఆధిక్యం సాధించింది చండీగఢ్. భారత క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంగా రికార్డులకెక్కింది.
నాలుగో భారీ ఆధిక్యం..
కోల్‌కతా లోని వీడియోకాన్ అకాడమీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో... మణిపూర్ జట్టు 63 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చండీగఢ్ తొలి ఇన్నింగ్స్‌ను 672/8 వద్ద డిక్లేర్ చేసింది. బిపుల్ శర్మ, గురీందర్ సింగ్‌లు ద్విశతకాలతో అదరగొట్టారు. కీపర్ ఉదయ్ కౌల్ 148 పరుగులు సాధించాడు. భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న 3 అత్యధిక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం రికార్డులు ఇవే.
>>1945-46 సీజన్లో హోల్కర్-మైసూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హోల్కర్ జట్టు 722 పరుగుల ఆధిక్యం నమోదు చేసింది.
>>1993-94 సీజన్లో హైదరాబాద్-ఆంధ్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 681 పరుగుల ఆధిక్యం సాధించింది.