సౌరాష్ట్ర రంజీ జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది. రంజీ చరిత్రలో తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో బంగాల్‌తో తలపడిన ఈ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 44 పరుగుల ఆధిక్యంతో విజేతగా నిలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా కావడం వల్ల.. మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా సౌరాష్టను టైటిల్ వరించింది.
శుక్రవారం చివరి రోజు ఆటలో బంగాల్ తన తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు సాధించిన సౌరాష్ట్ర విజేతగా నిలిచింది. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. రంజీ ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్‌లు డ్రా అయితే.. విజేతను తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ప్రకటించే నిబంధన ఉంది.
బౌలర్ల వల్లే..
తాజా రంజీ ట్రోఫీని ఎవరు గెలుస్తారనేది నిన్నటి వరకూ ఆసక్తి కొనసాగింది. గురువారం ఆట ముగిసే సమయానికి బంగాల్ 6 వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. ఫలితంగా ఈ రోజు ఆటలో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోరును బంగాల్ జట్టు అధిగమిస్తుందని అంతా భావించారు. కానీ సౌరాష్ట్ర బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 27 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది బంగాల్. ఓవర్‌నైట్ ఆటగాడు మజుందార్(63) ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత అమాబ్ నంది(40 నాటౌట్) అజేయంగా నిలిచినా మిగతా బ్యాట్స్‌మన్ విఫలమవడం వల్ల బెంగాల్‌కు ఆధిక్యం దక్కలేదు. చివరకు మ్యాచ్ కూడా డ్రాగా ముగియడం వల్ల సౌరాష్ట్ర ట్రోఫీని ముద్దాడింది. సెంచరీతో రాణించిన ఆ రాష్ట్ర బ్యాట్స్‌మన్ అర్పిత్‌ను 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' వరించింది.
స్కోర్లు స్వల్పంగా...