తెలంగాణ

telangana

By

Published : Aug 22, 2020, 9:13 AM IST

ETV Bharat / sports

'ఈ ఖేల్​రత్న మరిన్ని విజయాలకు స్ఫూర్తి'

అత్యున్నత పురస్కారం ఖేల్​రత్న అందుకోబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది భారత మహిళల హాకీ సారథి రాణీ రాంపాల్​. మరిన్ని గొప్ప విజయాలు సాధించి, దేశ ఖ్యాతిని పెంచేందుకు తనలాంటి క్రీడాకారిణిలకు ఈ అవార్డు స్ఫూర్తిని అందిస్తుందని చెప్పింది.

Rani Rampal
రాణి రాంపాల్​

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్నకు ఎంపికవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది భారత మహిళల హాకీ సారథి రాణీ రాంపాల్​. ఈ అవార్డు మరిన్ని విజయాలు సాధించేలా స్ఫూర్తి నింపిందని చెప్పింది.

"నాకు ముఖ్యంగా నా కుటుంబానికి ఇది గర్వపడే సందర్భం. దేశంలో క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారమైన రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అందుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. కేరీర్​ ఆరంభం నుంచి అండగా నిలిచిన నా కోచ్​లు, సహచరులు, మిత్రులు, కుటుంబసభ్యులకే ఈ ఘనత దక్కుతుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తే గొప్పగా అనిపిస్తుంది. మరిన్ని మంచి విజయాలు సాధించి, దేశ ఖ్యాతిని పెంచేందుకు నాలాంటి క్రీడాకారిణిలకు ఈ అవార్డు స్ఫూర్తిని అందిస్తుందని నమ్ముతున్నా."

-రాణి, హాకీ ప్లేయర్​

రాణితో పాటు ఓపెనర్ రోహిత్​ శర్మ, రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​, పారా ఒలింపిక్​ పసిడి విజేత మరియప్పన్​ తంగవేలు, టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి మనిక బత్రాలను ఈ ఏడాది ఖేల్​రత్న అవార్డులకు ఎంపిక చేసినట్లు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రకటించింది.

రాణి రాంపాల్​

ఇది చూడండి ఆసీస్ ఆల్​రౌండర్ కామెరూన్ వైట్ వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details