తెలంగాణ

telangana

ETV Bharat / sports

రానా, రసెల్​ మెరుపులు.. కోల్​కతా భారీ స్కోరు - kolkata knight riders

కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో జరుగుతున్న మ్యాచ్​లో కోల్​కతా బ్యాట్స్​మెన్​ నితీష్ రానా, రసెల్, ఊతప్ప చెలరేగి ఆడారు. దీంతో 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది కోల్​కతా నైట్​ రైడర్స్​.

కోల్ కతా జట్టు

By

Published : Mar 27, 2019, 9:54 PM IST

ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్​తో జరుగుతన్న మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్​కతా నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు కాసేపు మెరిపించగా 3.3 ఓవర్లలో స్కోర్ 36కి చేరింది. ఇద్దరూ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన ఊతప్ప, నితీష్ రానా కుదురుగా ఆడుతూ పరుగులు సాధించారు.

రానా మెరుపు బ్యాటింగ్​

మొదట నెమ్మదిగా ఆడిన రానా తర్వాత వేగం పెంచి బౌండరీలు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ క్రమంలోనే వరుసగా రెండో మ్యాచ్​లోనూ అర్ధసెంచరీ సాధించాడు. 63 పరుగుల (34 బంతులు, 7 సిక్సులు, 2 ఫోర్లు) వ్యక్తిగత స్కోర్ వద్ద చక్రవర్తి బౌలింగ్​లో రానా అవుటయ్యాడు. ఊతప్ప 67 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు.

రసెల్​ విధ్వంసం..

రానా అవుయ్యాక బ్యాటింగ్​కు వచ్చిన రసెల్ విధ్వంసమే సృష్టించాడు. షమి వేసిన 19 ఓవర్లో వరుసగా మూడు సిక్సులు.. ఓ ఫోర్ సాధించాడు. 17 బంతుల్లో 5 సిక్సులు, 3 బౌండరీలతో 48 పరుగులు చేసి అవుటయ్యాడు.

కోల్​కతా బౌలర్లలో షమి, చక్రవర్తి, హార్జస్​ విల్​జోన్​​, ఆండ్రూ టై చెరో వికెట్ పడగొట్టారు.

ఇవీ చూడండి..'మన్కడింగ్​ విషయంలో అశ్విన్​ తప్పేమీ లేదు'

ABOUT THE AUTHOR

...view details