పాకిస్థాన్ స్టార్ బౌలర్ మహ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై ఆ దేశ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక అత్యుత్తమ ఆటగాడు కెరీర్‌ను అకస్మాత్తుగా ముగించడం చాలా బాధగా ఉందని అన్నాడు.
"ఓ సమర్థవంతమైన సూపర్‌స్టార్ అకస్మాత్తుగా రిటైరవ్వడం బాధాకరం. భావి క్రికెటర్లకు ఇదొక పాఠం. మీ బాధ్యతలను గుర్తించండి. గౌరవాన్ని తాకట్టు పెట్టి డబ్బు సంపాదించకండి. బలమైన వ్యక్తిత్వం వల్లే గౌరవం లభిస్తుంది కానీ సంపదతో అది రాదు"
-- రమీజ్ రాజా, పాక్ మాజీ ఆటగాడు
వ్యక్తిగత నిర్ణయం..
ఆమిర్ రిటైర్మెంట్ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ధారించింది. ఇది అతడి వ్యక్తిగత నిర్ణయమని, దీనిని పీసీబీ గౌరవిస్తుందని చెప్పింది. ఈ అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పేర్కొంది.