భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ఎన్నిక లాంఛనం కానుంది. ఐపీఎల్ ఛైర్మన్‌గా మరోసారి బ్రిజేష్ పటేల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈనెల 24న జరగబోయే బీసీసీఐ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయాల్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
బోర్డులో ప్రస్తుతం ఉపాధ్యక్షుని పదవితో పాటు ఐపీఎల్ పాలకమండలిలో రెండు పదవులను భర్తీ చేయడానికి ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే వాటి కోసం ఏకగ్రీవ ఎన్నిక జరపాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. బీసీసీఐలోని సభ్యులందరూ దీనికి ఆమోదం తెలపనున్న క్రమంలో ఉపాధ్యక్షుని పదవికి రాజీవ్ శుక్లా గురువారం నామినేషన్ దాఖలు చేశారు.