తెలంగాణ

telangana

ETV Bharat / sports

100 మ్యాచ్​లాడిన ఒకే ఒక్కడు.. క్రికెట్​కు వీడ్కోలు - రంజీ ఆటగాడు వినీత్ సక్సేనా రిటైర్మెంట్

రంజీ ఆటగాడు వినీత్ సక్సేనా తన క్రికెట్ కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2018-19 సీజన్​లో ఉత్తరాఖండ్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు.

సక్సేనా
సక్సేనా

By

Published : Jan 28, 2020, 12:48 PM IST

Updated : Feb 28, 2020, 6:39 AM IST

రాజస్థాన్ రంజీ క్రికెటర్ వినీత్ సక్సేనా.. తన క్రికెట్ కెరీర్​కు గుడ్​బై చెప్పాడు. రాజస్థాన్ తరఫున 100 కంటే ఎక్కువ మ్యాచ్​లాడిన ఏకైక క్రికెటర్​గా ఇతడు ఘనత సాధించాడు. 2011-12 సీజన్​లో ఇతడు చేసిన డబుల్ సెంచరీతోనే ఆ రాష్ట్రానికి రంజీ ట్రోఫీ వచ్చింది.

39 ఏళ్ల వినీత్ సక్సేనా.. 1998-99 సీజన్​లో బంగాల్​పై తొలి రంజీ మ్యాచ్​ ఆడాడు. 2018-19 సీజన్​లో ఉత్తరాఖండ్​కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్​లో విదర్భతో జరిగిన మ్యాచ్​ ఇతడికి చివరిది.

మొత్తం కెరీర్​లో ఉత్తరాఖండ్, రాజస్థాన్, రైల్వేస్​కు ప్రాతినిధ్యం వహించిన సక్సేనా.. 129 మ్యాచ్​ల్లో 7,637 పరుగులు చేశాడు. ఇందులో ఓ ద్విశతకం, 17 సెంచరీలు, 38 అర్ధశతకాలు ఉన్నాయి. బ్యాటింగ్​ సగటు 36.89గా ఉంది.

2011-12 సీజన్​లో తమిళనాడుతో ఫైనల్​లో చేసిన డబుల్ సెంచరీ, వినీత్ కెరీర్​లో మరపురాని ఇన్నింగ్స్​గా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్​లో 257 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ (904 నిమిషాలు) ఆడి రాజస్థాన్​కు రంజీ ట్రోఫీని అందించాడు.

ఇవీ చూడండి.. ఆటకు గుడ్​బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్

Last Updated : Feb 28, 2020, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details