ఐపీఎల్ ప్రారంభానికి మరో 40 రోజులు ఉంది. అయినాసరే ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో పండగ వాతావరణం నెలకొంది. దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఆడబోతున్నామనే ఉత్సాహంలో క్రికెటర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ కోహ్లీ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయాడు.
కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్తాడని, అందుకు సంబంధించిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఇదే విషయంపై స్పందించిన ఫ్రాంచైజీ.. కోహ్లీనీ తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఓ షరతు కూడా ఉందని ట్వీట్ చేసింది. విరాట్‌తో పాటే ఆర్సీబీ ఇన్సైడర్ నాగ్స్ను తీసుకొస్తే.. ఇద్దరినీ జట్టులోకి స్వాగతిస్తామని చమత్కరించింది.