తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ స్టార్​ క్రికెటర్​కు నిశ్చితార్థం - రాహల్​ తెవాతియా పెళ్లి

రాజస్థాన్​ రాయల్స్​ ఆల్​రౌండర్​ రాహుల్​ తెవాతియా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాలో అభిమానులతో పంచుకున్నాడు.

rahul
రాహల్​ తెవాతియా

By

Published : Feb 4, 2021, 3:21 PM IST

ఐపీఎల్​ 13వ సీజన్​లో ఓవర్​నైట్​ స్టార్​ అయిపోయిన ఆటగాడు రాజస్థాన్​ రాయల్స్​ ఆల్​రౌండర్​ రాహుల్​ తెవాతియా. ఇప్పుడు అతడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గురువారం అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో నిశితార్థం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా అతడికి ఆశ్వీరాదాలు అందిస్తున్నారు. ఈ వేడుకకు క్రికెటర్స్​ నితీశ్​ రానా, జయంత్​ యాదవ్​ హాజరయ్యారు. అయితే ఈ ఆల్​రౌండర్​ను వివాహమాడబోయే అమ్మాయి వివరాలు ఇంకా తెలియలేదు.

రాహల్​ తెవాతియా

ఐపీఎల్​ 13వ సీజన్​లో పంజాబ్​తో జరిగిన ఓ మ్యాచ్​లో తన అద్భుతమైన ఇన్నింగ్స్​తో ఐదు సిక్స్​లు బాది అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు తెవాతియా. ఆ మ్యాచ్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 11 ఇన్నింగ్స్​లో 255 పరుగులతో పాటు 10 వికెట్లు తీసి అదరగొట్టాడు.

రాహల్​ తెవాతియా
రాహల్​ తెవాతియా

ఇదీ చూడండి :ఓ ఇంటివాడైన మరో టీమ్​ఇండియా క్రికెటర్‌

ABOUT THE AUTHOR

...view details