పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు,, ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. మొదటగా టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఇరుజట్లు తలపడిన మొదటి మ్యాచ్‌లో మన్కడింగ్ వివాదం చెలరేగింది. ఈ కారణంగా రాజస్థాన్ జట్టు ఓటమిపాలైంది. పంజాబ్ కెప్టెన్ అశ్విన్‌పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వీరి మధ్య మ్యాచ్ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.