ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ నియమితుడయ్యాడు. వచ్చే మూడేళ్ల పాటు కోచ్‌గా వ్యవహరించేందుకు అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ ట్విట్టర్లో పంచుకుంది.
ఐపీఎల్‌లో ఆండ్రూ.. దిల్లీ డేర్‌డేవిల్స్ (ఇప్పటి దిల్లీ క్యాపిటల్స్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. అలాగే బెంగళూరు జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో.. కోచ్‌గా విక్టోరియా జట్టును విజేతగా నిలిపాడు. 2018-19 బిగ్‌బాష్ సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఆండ్రూ.