త్వరలో యూఏఈలో జరగబోయే ఐపీఎల్ పదమూడో సీజన్ కోసం ధోనీ అభిమానులు రెడీగా ఉండాలని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అన్నాడు. ఈసారి మెగా టోర్నీలో రెచ్చిపోవడానికి తమ సారథి ధోనీ సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. ఇటీవల డబ్ల్యూటీఎఫ్ స్పోర్ట్స్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడైన రైనా.. సెప్టెంబర్ 19 నుంచి నిర్వహించే ఐపీఎల్‌లో ధోనీ ఎలా ఆడబోతున్నాడనే విషయాన్ని సూచనప్రాయంగా వివరించాడు.
'ఐపీఎల్‌కు ధోనీ బ్రాండ్ అంబాసిడర్' - ధోనీ గురించి రైనా
త్వరలో జరగబోయే ఐపీఎల్ కోసం మహేంద్రసింగ్ ధోనీ అభిమానులు సిద్ధంగా ఉండాలని అన్నాడు టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా. ఈసారి మహీ రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు.

కరోనా మహమ్మారికి ముందు తాను మహీతో కలిసి ఉన్నానని, ఆ సమయంలో అతను చాలా కష్టపడి సాధన చేశాడని గుర్తు చేసుకున్నాడు రైనా. దాంతో రాబోయే టోర్నీలో అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శనతో పాటు హెలికాఫ్టర్ షాట్లు ఆశించొచ్చని పేర్కొన్నాడు. అలాగే క్రికెట్‌లో ధోనీ గొప్ప ఆటగాడని, ఐపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లా ఉంటాడని రైనా అన్నాడు.
లాక్‌డౌన్‌తో నెలల పాటు ఇంటికే పరిమితమైన క్రికెటర్లు.. ఐపీఎల్‌పై స్పష్టత రావడం వల్ల తిరిగి సాధన మొదలుపెట్టారు. రైనా కూడా తన ఇంటికి సమీపంలో ఉన్న మైదానంలో ఈ మధ్యే ప్రాక్టీస్ ప్రారంభించాడు. రిషభ్ పంత్, మహ్మద్ షమీలతో కలిసి సాధన చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.