టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా. అతడి కెప్టెన్సీ వల్లే చెన్నై సూపర్‌కింగ్స్.. ఐపీఎల్ చరిత్రలో టాప్ ఫ్రాంఛైజీగా మారిందని అన్నాడు. సారథిగా అతడు జట్టును నడిపించే తీరు అద్భుతమని కొనియాడాడు.
"వికెట్ల వెనకుండి ధోనీ మ్యాచ్‌ను ఆసాంతం నడిపిస్తాడు. ఏ పరిస్థితుల్లో ఎవరితో బౌలింగ్ చేయించాలో అతడికి బాగా తెలుసు" -సురేశ్ రైనా, టీమిండియా సీనియర్ క్రికెటర్
2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి చెన్నైకు ధోనీ కెప్టెన్సీ వహిస్తున్నాడు. అన్ని సీజన్లలో ఫ్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఈ జట్టు.. మూడుసార్లు విజేతగా నిలిచింది. ఐదుసార్లు రన్నరప్స్గా ఉంది.