టీమిండియా-న్యూజిలాండ్ మధ్య నేడు జరిగే తొలి టీ20 కోసం ఇరుజట్లు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి, సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తున్నాయి. కానీ వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది. అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 6:50 కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో తేలికపాటి జల్లులు కురవొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కువగా వర్షం పడితే మ్యాచ్ రద్దు చేయొచ్చు.
భారత్-న్యూజిలాండ్ తొలి టీ20కి వర్షం ముప్పు! - sports news
కివీస్‌తో కోహ్లీసేన తలపడే తొలి టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

భారత్-న్యూజిలాండ్ తొలి టీ20
కివీస్ పర్యటనలో భాగంగా భారత్.. 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. తొలి మ్యాచ్ ఈరోజు ఆక్లాండ్ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:20 గంటలకు మొదలవనుంది.
Last Updated : Feb 18, 2020, 5:11 AM IST