తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియా బుష్​ఫైర్ ఛారిటీ మ్యాచ్​ వాయిదా - బుష్​ఫైర్ ఛారిటీ మ్యాచ్ రద్దు

ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులను ఆదుకునేందుకు ఆసీస్ క్రికెట్ బోర్డు ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించాలని భావించింది. శనివారం ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వర్షం వచ్చే సూచన ఉన్న కారణంగా దీనిని ఆదివారానికి వాయిదా వేశారు.

ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా

By

Published : Feb 6, 2020, 11:21 AM IST

Updated : Feb 29, 2020, 9:26 AM IST

ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులను ఆదుకునేందుకు విరాళాల సేకరణ కోసం ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించాలని భావించింది ఆసీస్ క్రికెట్ బోర్డు. బిగ్​బాష్​ లీగ్​ ఫైనల్​ ముందు ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే సిడ్నీలో శనివారం వర్షం వచ్చే సూచన ఉండటం వల్ల ఈ మ్యాచ్​ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు.

"శనివారం సిడ్నీ మైదానంలో బిగ్​బాష్ లీగ్ ఫైనల్ జరగుతుంది. కానీ ఛారిటీ మ్యాచ్​ను నిర్వహించే అవకాశం లేదు. ఆదివారం మెల్​బోర్న్ ఓవల్ జంక్షన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది."
-క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన

ఎందరో ప్రముఖులు..

ఈ మ్యాచ్​లో యువరాజ్ సింగ్​తో పాటు పాకిస్థాన్​ మాజీ ఆల్​రౌండర్​ వసీం అక్రమ్​, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు జస్టిన్​ లాంగర్​, మాథ్యూ హెడెన్​, ఆండ్రూ సైమండ్స్​, బ్రాడ్​ హడిన్​, మైక్​ హస్సీ, ఆడమ్​ గిల్​క్రిస్ట్​, మైఖెల్​ క్లార్క్​, షేన్​ వాట్సన్​, అలెక్స్​ బ్లాక్​ వెల్​ బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు నాన్​ ప్లేయింగ్​ కెప్టెన్లుగా ఆసీస్​ మహిళా క్రికెటర్​ మేల్​ జేన్స్​, స్టీవ్​ వా కూడా కనువిందు చేయనున్నారు.

బిగ్ బాష్ ఫైనల్ శనివారం సిడ్నీ వేదికగా జరగనుంది. ఇప్పటికే సిడ్నీ సిక్సర్స్​ ఫైనల్​లో అడుగుపెట్టింది. మెల్​బోర్న్ స్టార్స్​, సిడ్నీ థండర్స్​ మరో ఫైనల్ బెర్త్ కోసం నేడు తలపడనున్నాయి.

Last Updated : Feb 29, 2020, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details