రాహుల్ ద్రవిడ్ సహచర అండర్-19 క్రికెటర్ సురేశ్ కుమార్(47) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని తనువు చాలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన దేహాన్ని కుమారుడు తొలుత గుర్తించారని, ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.
భారత అండర్-19 మాజీ క్రికెటర్ ఆత్మహత్య - రాహుల్ ద్రవిడ్ సురేశ్ కుమార్
భారత్ అండర్-19 మాజీ క్రికెటర్ సురేశ్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు.
భారత అండర్-19 మాజీ క్రికెటర్ ఆత్మహత్య
కేరళకు చెందిన సురేశ్ కుమార్.. 1991-92, 2005-06 మధ్య కాలంలో 72 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడారు. 1657 పరుగులతో పాటు 196 వికెట్లు తీశారు. కేరళ తరఫున 52 రంజీ మ్యాచ్లు, రైల్వేస్ తరఫున 17 మ్యాచ్లు ఆడారు. సౌత్ జోన్, సెంట్రల్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీలోనూ ప్రాతినిధ్యం వహించారు. 1992లో భారత్ అండర్-19 వన్డే, టెస్టు జట్లకు ఆడారు.