తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేర్చాలి : ద్రవిడ్​

ఒలింపిక్స్​లో టీ20 క్రికెట్​ను చేర్చాలని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ సారథి రాహుల్​ ద్రవిడ్​. ఇది జరిగితే క్రికెట్​ మరింత అభివృద్ధి చెందుతుందన్నాడు.

Rahul Dravid
ద్రవిడ్​

By

Published : Nov 14, 2020, 8:17 PM IST

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్​లో ప్రజాదరణ కలిగిన క్రికెట్​కు కూడా స్థానం కల్పించాలని చాలా కాలం నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం మరో సారి తెరపైకి వచ్చింది. ఒలింపిక్స్​లోకి క్రికెట్​ను చేర్చాలన్న వాదనకు తాను మద్దతిస్తానని తెలిపాడు టీమ్​ఇండియా మాజీ సారథి రాహుల్​ ద్రవిడ్. ఇదే కనుక జరిగితే క్రికెట్​ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డాడు.

"ఒలింపిక్స్​లో టీ20 ఫార్మాట్​ను చేర్చాలి. ఎందుకంటే 75 దేశాల్లో క్రికెట్​ ఆడుతున్నారు. ఇది జరిగితే ఈ ఆట చాలా అభివృద్ధి చెందుతుంది. అయితే ఇందులో కొన్ని సవాళ్లు ఉంటాయి. మ్యాచ్​లు రక్తి కట్టించాలంటే అనేక ఏర్పాట్లు, సదుపాయాలు అవసరం. ఐపీఎల్ విజయవంతమైందంటే నాణ్యమైన పిచ్​లు ఉండటమే కారణం. మెరుగైన సదుపాయాలు అందుబాటులో ఉంటే ఒలింపిక్స్​లో క్రికెట్ ఎందుకు ప్రజాదరణ పొందదు? ఏదేమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ ఒలింపిక్స్​లో ప్రవేశించాలంటే మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నాను."

-ద్రవిడ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

కాగా, క్రికెట్​ను ఒలింపిక్ క్రీడగా చేసేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. 2018లో ఐసీసీ సర్వే నిర్వహించగా, 87 శాతం మంది ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేర్చేందుకు మద్దతు పలికారు. 2010, 2014లో ఆసియా క్రీడల్లో క్రికెట్​ను చేర్చినా బీసీసీఐ మాత్రం టీమ్​ఇండియాను పంపలేదు.

ఇదీ చూడండి :

విస్తరణకు ఐపీఎల్​ సిద్ధంగా ఉంది: ద్రవిడ్​

నిస్వార్థ క్రికెట్​ సేవకా.. నీరాజనం!

ABOUT THE AUTHOR

...view details