తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాతీయ క్రికెట్​ అకాడమీ అధ్యక్షుడిగా రాహుల్ - నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్

జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్​సీఏ)కి అధ్యక్షుడిగా నియమితులయ్యాడు భారత్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. జులై 8 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

రాహుల్ ద్రావిడ్

By

Published : Jul 9, 2019, 2:09 PM IST

​జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) అధ్యక్షుడిగా ఎంపికైన భారత మాజీ ఆటగాడు రాహుల్​ ద్రవిడ్​... జులై 8న పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అండర్‌-19, భారత్‌-ఏ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్న మిస్టర్​ వాల్​... ఈ హోదాలో చేరేందుకు బీసీసీఐ నిబంధన అడ్డుగా నిలిచింది. ఏ వ్యక్తి పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన ప్రకారం రెండు పదవుల్లో ఉండకూడదు.

ఇప్పటివరకు ఇండియా సిమెంట్స్​లో ఉపాధ్యక్ష పదవిలో ఉన్న ద్రవిడ్​... తాజాగా ఆ హోదా నుంచి రెండేళ్ల కాలానికి తాత్కాలిక విరామం తీసుకున్నారు. ఫలితంగా ఎన్​సీఏలో చేరేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.

" జాతీయ జట్టులోకి పురుష, మహిళ క్రీడాకారులను తయారుచేసేందుకు ద్రవిడ్​ పనిచేస్తారు. వాళ్ల పర్యవేక్షణ, శిక్షణ, తర్ఫీదుతో పాటు ఆటగాళ్లు, జూనియర్​ కోచ్​లు, సిబ్బందికి స్ఫూర్తి నింపేందుకు ఆయన​ సేవలు ఉపయోగపడతాయి. ఎన్​సీఏతో పాటు భారత్​-ఏ, అండర్​-19, అండర్-23 జట్లకు పర్యవేక్షణ బాధ్యతలు రాహుల్​ ద్రవిడ్​ అధీనంలో ఉంటాయి ".
--బీసీసీఐ

ఎన్‌సీఏ అధ్యక్ష పదవికి కాలపరిమితిని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ద్రవిడ్ నేతృత్వంలోనే ఎందరో ఆటగాళ్లు జాతీయ జట్టులోకి వచ్చారు. ఈ లెజెండరీ ఆటగాడి పర్యవేక్షణలోనే పంత్ అండర్-19 జట్టులో ఆడటం, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్​లోనూ చోటు దక్కించుకోవడం విశేషం.

ఇది చదవండి: 'బాటిల్​క్యాప్ ​ఛాలెంజ్​' యువరాజ్​ స్టైల్​లో...

ABOUT THE AUTHOR

...view details