అఫ్గానిస్థాన్ యువ ఆటగాడు రహ్మత్ షా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఆ దేశం తరఫున శతకం సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో రెండో వికెట్‌గా వచ్చిన రహ్మత్ షా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు సాధించాడు. మూడో వికెట్‌కు 29 పరుగులు జత చేసిన రహ్మత్ షా.. నాలుగో వికెట్‌కు హష్మతుల్లా షాహిదీతో కలిసి 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు . ఈ క్రమంలోనే సెంచరీ సాధించాడు.
ఈ ఏడాది రహ్మత్ రెండుసార్లు టెస్టు సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. మార్చిలో ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగుల వద్ద ఔటయ్యాడీ యువ ఆటగాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేసి నిష్క్రమించాడు.
వివిధ దేశాల తరఫున తొలి టెస్టు సెంచరీ సాధించిన ఆటగాళ్లు..
- చార్లెస్ బ్యానర్‌మెన్ ( ఆస్ట్రేలియా)
- అమినుల్ ఇస్లామ్ (బంగ్లాదేశ్)
- డబ్యూ జీ గ్రేస్ (ఇంగ్లాండ్)
- లాలా అమర్‌నాథ్ (భారత్)
- కెవిన్ ఓబ్రియన్ (ఐర్లాండ్)
- స్టీవీ డెమ్‌స్టర్ (న్యూజిలాండ్)
- నాజర్ మహ్మద్ (పాకిస్థాన్)
- జిమ్మీ సింక్లేర్ (దక్షిణాఫ్రికా)
- సిదాత్ వెట్టిమునీ (శ్రీలంక)
- క్లిఫోర్డ్ రోచ్ (వెస్టిండీస్)
- డేవ్ హాటన్ (జింబాబ్వే)
- రహ్మత్ షా (అఫ్గానిస్థాన్)
ఇవీ చూడండి.. ఖడ్గమృగాల సంరక్షణకు రోహిత్‌శర్మ పిలుపు