బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ విజృంభిస్తున్నారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుత శతకంతో అదరగొట్టి.. ద్విశతకంవైపు సాగుతున్నాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే 86 పరుగులు చేసి ఔటయ్యాడు.
సెంచరీకి చేరువగా వచ్చిన అజింక్య రహానే.. అబుజాయేద్ బౌలింగ్‌లో పెవిలయన్‌కు చేరాడు. ఆఫ్ సైడ్ దిశగా వస్తున్న బంతిని షాట్ కొట్టిన భారత వైస్ కెప్టెన్.. బౌండరీ లైన్లో తైజుల్ ఇస్లామ్‌కు క్యాచ్ ఇచ్చాడు. 4 వికెట్లు అబు జాయేదే తీయడం విశేషం. ప్రస్తుతంక్రీజులో మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా ఉన్నారు.