భారత స్టార్ ఆటగాడు అజింక్య రహానే ఇటీవలే హాంప్‌షైర్ జట్టులో చోటు దక్కించుకున్న భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు. అయితే ఇదే జట్టు తరఫున.. బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే శతకం బాదేశాడు. ఫలితంగా కౌంటీ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టిన మూడో భారతీయుడిగా పేరు తెచ్చుకున్నాడు. నాటింగ్‌హామ్ షైర్ జట్టుపై రహానే శతకం కొట్టడం వల్ల 319 భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది హాంప్‌షైర్ జట్టు.
కౌంటీ అరంగ్రేటంలోనే రహానే రికార్డు శతకం... - హాంప్‌షైర్ జట్టు
భారత క్రికెటర్ అజింక్య రహానే మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. కౌంటీ క్రికెట్ అరంగ్రేటంలోనే హాంప్‌షైర్ జట్టు తరఫున బరిలోకి దిగి శతకం సాధించాడు.
![కౌంటీ అరంగ్రేటంలోనే రహానే రికార్డు శతకం...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3355072-thumbnail-3x2-rahane.jpg)
కౌంటీ క్రికెట్లో రహానే రికార్డు శతకం...
తొలి ఇన్నింగ్స్‌లో హాంప్‌షైర్ జట్టు 310 పరుగులు చేయగా... నాటింగ్‌హామ్ షైర్ జట్టు 239 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసేసరికి 367 పరుగులు చేసింది హాంప్‌షైర్. ఫలితంగా 300 పైచిలుకు పరుగులతో భారీ లక్ష్యం దిశగా సాగుతోంది.
ఇవీ చూడండి--> కౌంటీల్లో హాంప్‌షైర్‌కు రహానే ప్రాతినిధ్యం