టీమ్ఇండియా తాత్కాలిక టెస్టు కెప్టెన్ అజింక్య రహానె రాకతో డ్రస్సింగ్ రూమ్లో ప్రశాంతత పెరిగిందని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అదే మైదానంలో బాగా రాణించడానికి కారణమైందని చెప్పాడు. తొలి పోరులో ఓడినా సరే బాక్సింగ్ డే టెస్టులో పుంజుకున్నామని మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
"36 పరుగులకే ఆలౌట్ అవ్వడం సాధారణ విషయం కాదు. తొలి టెస్టులో ఓడిన తర్వాత అంతే వేగంగా గెలవడం మా జట్టుకు గర్వకారణం. రహానె కెప్టెన్ అయిన తర్వాత డ్రస్సింగ్ రూమ్లో ప్రశంతమైన వాతావరణం వచ్చింది. ఆ ప్రశాంతతే మైదానంలో రాణించడానికి కారణమై ఉండొచ్చు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్లో స్టీవ్ స్మిత్ ఔట్ అవ్వకపోయి ఉంటే మా విజయం కొంచెం కష్టమయ్యేది. అతడిని ఔట్ చేయడానికి ముందుగా అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాం"