బోర్డర్ గవాస్కర్ సిరీస్ మూడో టెస్టులో జాత్యహంకార వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మూడో రోజు ఆటలో పేసర్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వివక్షకు గురయ్యారు. దీనిపై ఐసీసీకి టీమ్ఇండియా ఫిర్యాదు చేసింది. నాలుగో రోజు ఆటలోనూ సిరాజ్కు మరోసారి అలాంటి అనుభవమే ఎదురైంది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అతడిపై ప్రేక్షకుల గుంపు నుంచి ఓ అల్లర్ల మూక జాతి వివక్ష వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని సారథి రహానెకు చెప్పగా, అతడు మ్యాచ్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో కాసేపు ఆట నిలిచిపోయింది.
వెంటనే స్పందించిన మైదానం సిబ్బంది, పోలీసులు ఘటనకు పాల్పడిన ఆరుగురు యువకులను బయటకు పంపించారు. ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్‌ఇండియాకు క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు అధికార ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఖండించిన ఐసీసీ
మూడో టెస్టులో టీమ్ఇండియా క్రికెటర్లపై ఆసీస్ ప్రేక్షకులు చేసిన జాత్యహంకార వ్యాఖ్యలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యలపై ఆసీస్ బోర్డు నివేదిక ఇవ్వాలని సూచించింది. క్రికెట్‌లో ఏ విధమైన వివక్షకు చోటు లేదని చెప్పిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్నీ.. కొందరు ప్రేక్షకుల ప్రవర్తనతో చాలా నిరాశ చెందామని అన్నారు. అభిమానులు నిబంధనలకు కట్టుబడి ఉన్నారా లేరా అన్న అంశాన్ని పరిశీలించాలని సూచించారు. జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన అభిమానులను మైదానం నుంచి బయటకు పంపడాన్ని స్వాగతించారు.
గతంలోనూ చాలాసార్లు