అండర్ 19 ప్రపంచకప్‌లో తాజాగా చోటుచేసుకున్న వివాదాస్పద మన్కడింగ్ ఔట్‌పై ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఐసీసీకి ట్వీట్ చేశాడు. స్పందించిన టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో కొంటె సమాధానమిచ్చాడు.
అసలేం జరిగిందంటే?

అండర్ 19 ప్రపంచకప్‌లో శుక్రవారం.. పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ జట్లు తలపడ్డాయి. అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ బౌలింగ్ చేస్తుండగా పాక్ ఓపెనర్ మొహమ్మద్ హురైరా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో క్రీజును వదిలి ముందుకెళ్లాడు. వెంటనే అఫ్గాన్ స్పిన్నర్ వికెట్లను గిరాటేయడం వల్ల పాక్ ఓపెనర్ మన్కడింగ్‌లో భాగంగా ఔటయ్యాడు. ఫీల్డ్ అంపైర్..థర్డ్ అంపైర్‌కు నివేదించగా, హురైరా ఔటయ్యాడని పేర్కొంది.
ఈ మన్కడింగ్ విధానాన్ని తొలగించాలని అండర్సన్.. శనివారం ఐసీసీ, ఎంసీసీలకు ట్విటర్‌లో విజ్ఞప్తి చేశాడు. ఇది చూసిన అశ్విన్, అండర్సన్‌కు చురక అంటించాడు. 'ఈ నిబంధనను తొలగించాలంటే కాసింత ఆలోచించాలి. ఇప్పటికైతే నడిచిపోతుంది' అని నవ్వుతున్న ఎమోజీలను జతచేశాడు.
గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్‌ను.. అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్‌తోనే ఔట్ చేశాడు. ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, క్రికెట్ నిబంధనల్లో ఇలాంటి ఔట్ చెల్లుబాటు అవుతుంది.