తెలంగాణ

telangana

ETV Bharat / sports

అశ్విన్.. ఈ సారి జయసూర్యలా బౌలింగ్​ - jayasurya

గులాబి బంతితో ప్రాక్టీస్​లో భాగంగా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్యను అనుకరిస్తూ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

అశ్విన్

By

Published : Nov 18, 2019, 3:50 PM IST

గతంలో వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్, టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్​ల బౌలింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు.. శ్రీలంక దిగ్గజం సనత్​ జయసూర్యను అనుకరించాడు. డే/నైట్ టెస్టు కోసం గులాబి బంతితో ప్రాక్టీస్ చేస్తూ.. లంక మాజీ క్రికెటర్​ శైలిలో బౌలింగ్ చేశాడు అశ్విన్.

టీమిండియా క్రికెటర్లు.. ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్​లో తీవ్రంగా చెమటలు చిందిస్తున్నారు. ఇందులో భాగంగా రవిచంద్రన్ అశ్విన్.. లంక దిగ్గజం సనత్ జయసూర్యను అనుకరిస్తూ బౌలింగ్ చేశాడు. ఆ వీడియో వైరల్​గా మారింది. నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

ఇటీవలే ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాపై, ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతోటీమిండియా గెలిచింది. ఇప్పుడు నిర్ణయాత్మక రెండో టెస్టు నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ నెల 22న మ్యాచ్ ప్రారంభం కానుంది. డే/నైట్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ టెస్టులో తొలిసారి గులాబి బంతితో ఆడనుంది టీమిండియా.

ఇదీ చదవండి: విరాట్​కు బౌలింగ్ చేయడం చాలా కష్టం: అక్తర్

ABOUT THE AUTHOR

...view details