తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాఫ్రికా కెప్టెన్​​ డికాక్​ సంచలన నిర్ణయం - క్రికెట్​కు డికాక్​ విరామం

అంతర్జాతీయ క్రికెట్​కు దక్షిణాఫ్రికా టీమ్ కెప్టెన్​ క్వింటన్​ డికాక్ తాత్కాలిక విరామాన్ని ప్రకటించాడు​. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్​ బోర్డు సీఈఓ ఆండ్రూ బ్రీట్జ్​కే వెల్లడించాడు.

Quinton de Kock takes 'mental health' break from cricket
దక్షిణాఫ్రికా క్రికెటర్​ డికాక్​ సంచలన నిర్ణయం

By

Published : Feb 16, 2021, 10:19 AM IST

దక్షిణాఫ్రికా కెప్టెన్​ క్వింటన్​ డికాక్​.. క్రికెట్​ తాత్కాలికంగా విరామాన్ని తీసుకోనున్నాడు. మానసిక సమస్యల కారణంగా ఆటకు కొద్దిరోజులు దూరంగా ఉంటాడని సఫారీ క్రికెట్​ బోర్డు సీఈఓ ఆండ్రూ బ్రీట్జ్​కే వెల్లడించాడు.

"మానసిక ఒత్తిడి కారణంగా క్వింటన్​ డికాక్​ కొన్ని వారాల విరామాన్ని తీసుకోనున్నాడు. ఈ విషయంలో సౌతాఫ్రికా క్రికెట్​ అసోసియేషన్​తో పాటు క్రికెట్​ దక్షిణాఫ్రికా నుంచి అతడికి పూర్తి మద్దతు ఉంటుంది".

- ఆండ్రూ బ్రీట్జ్​కే, క్రికెట్​ దక్షిణాఫ్రికా సీఈఓ

దక్షిణాఫ్రికా వేదికగా పాకిస్థాన్​తో ఏప్రిల్​లో పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్​కు డికాక్​ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ​

ఇటీవలే పాకిస్థాన్​తో జరిగిన టెస్టు సిరీస్​లో కెప్టెన్​గా ఎంపికైన డికాక్​ బ్యాటింగ్​లో విఫలమయ్యాడు. ఆసియా దేశాలపై జరిగిన సిరీస్​లో దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శనపై కెప్టెన్​ డికాక్​పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇదీ చూడండి:కోహ్లీ సారథ్యంలో ఆడాలనుంది: మ్యాక్స్​వెల్​

ABOUT THE AUTHOR

...view details