ఇప్పటికే దక్షిణాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్.. వన్డేలకూ సారథిగా ఎంపికయ్యాడు. గతేడాది ప్రపంచకప్‌లో జట్టును నడిపించడంలో ఘోరంగా విఫలమైన డుప్లెసిస్ స్థానంలో అతడ్ని నియమించారు. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో వచ్చే నెల 4 నుంచి మొదలయ్యే 3 వన్డేల సిరీస్‌లో పాల్గొనే సఫారీ జట్టును డికాక్ నడిపించనున్నాడు.
దక్షిణాఫ్రికా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ - South Africa cricket team
సఫారీ టీ20 జట్టుకు సారథ్యం వహిస్తున్న డికాక్‌కు వన్డే కెప్టెన్‌గానూ బాధ్యతలు అప్పగించారు. త్వరలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది దక్షిణాఫ్రికా.
![దక్షిణాఫ్రికా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ దక్షిణాఫ్రికా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5794672-1104-5794672-1579662497999.jpg)
వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్
27 ఏళ్ల డికాక్.. గతంలో రెండు వన్డేలకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు డుప్లెసిస్‌తో పాటు పేసర్ రబాడకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.
Last Updated : Feb 17, 2020, 11:04 PM IST