తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రపంచకప్​లో బ్యాట్​ గురించి చాలా మంది అడిగారు'

2007 టీ20 ప్రపంచకప్​లో తన బ్యాట్​ గురించి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని చెప్పాడు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. 2011 ప్రపంచకప్​ సమయంలోనూ జరిగిన విషయాలన్ని వెల్లడించాడు.

By

Published : Apr 19, 2020, 11:58 AM IST

Questions were raised on my bat during 2007 T20 Word Cup: Yuvraj Singh
యువరాజ్ సింగ్

ఒకే ఓవర్లో ఆరు సిక్సులు అనగానే మనకు గుర్తొచ్చే పేర్లలో ఒకటి టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్. 2007 టీ20 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​తో మ్యాచ్​ సందర్భంగా ఈ ఘనత సాధించాడు యువీ. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో ఈ రికార్డు సృష్టించాడు. అయితే ఈ ఇన్నింగ్స్​ తర్వాత, తాను ఉపయోగించిన బ్యాట్ గురించి చాలా మంది తనను అడిగారని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

"సెమీస్​లో ఆసీస్​పై గెలిచిన తర్వాత ఆ జట్టు కోచ్ నా దగ్గరకు వచ్చి, న్యాయ బద్ధంగానే బ్యాట్​ తయారు చేశారా? అని ఆడిగాడు. మ్యాచ్​ రిఫరీ.. నా బ్యాట్​ను పరీక్షించాడు. నీ బ్యాట్​ ఎలా తయారు చేస్తున్నారు అని గిల్​క్రిస్ట్ అడిగాడు​. నిజం చెప్పాలంటే ఆ టోర్నీలో ఆడిన బ్యాట్​ నాకెంతో ప్రత్యేకం. ఇంతవరకు అలాంటి దానితో ఆడలేదు" -యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్

28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్​ను టీమిండియా గెలుచుకోవడంలోనూ కీలక పాత్ర పోషించాడు యువీ. అయితే ఈ టోర్నీలోని తన సెలక్షన్ గురించిన విషయాల్ని వెల్లడించాడు యువరాజ్.

2011 ప్రపంచకప్​లో యువరాజ్ సింగ్

"ఒక్కో కెప్టెన్ ఒక్కో క్రికెటర్​ను సపోర్ట్ చేస్తారు. ఈ విషయంలో ధోనీ ఎక్కువగా రైనాకు అవకాశాలిచ్చేవాడు. 2011 ప్రపంచకప్​లో రైనాతో పాటు యూసఫ్ పఠాన్, నేను బాగా ఆడేవాళ్లం. అయితే లెఫ్టార్మ్ స్పిన్నర్​ అవసరం జట్టుకు ఉండటం వల్ల మేనేజ్​మెంట్​కు నేను తప్పు మరో మార్గం కనిపించలేదు" -యువరాజ్ సింగ్, భారత మాజీ క్రికెటర్

ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.. తనకిష్టమైన సారథి అని చెప్పాడు యువరాజ్. ఆట విషయంలో తనను దాదా ఎక్కువగా సపోర్ట్ చేసేవాడు అని తెలిపాడు యువీ.

సౌరభ్ గంగూలీతో యువరాజ్ సింగ్

ABOUT THE AUTHOR

...view details