ఆర్సీబీ చైర్మన్ సంజీవ్ చురివాలాపై మిగతా ఫ్రాంచైజీలు మండిపడ్డాయి. ఐపీఎల్లో పాల్గొనాల్సిన.. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆడే ఆటగాళ్లు వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని ఆగస్టు 21న ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ప్రతిఒక్కరికీ ఒకేరకమైన నియమ నిబంధనలు వర్తించావా? అంటూ ప్రశ్నలు సంధించాయి మిగిలిన ఫ్రాంచైజీలు. ప్రతి ఆటగాడితో సహా మిగితా సిబ్బంది తప్పకుండా ఈ నిబంధనలు పాటించాల్సిందేనని ఉద్ఘాటింటాయి.
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య రెండు టీ20లు మూడు వన్డేలతో కూడిన సిరీస్ సెప్టెంబరు 4 నుంచి 16 వరకు బయోసెక్యూర్ వాతవరణంలో జరగనుంది. దీనికోసం ముందుగా ఇరు జట్ల ఆటగాళ్లు క్వారంటైన్లో ఉంటారు. ఈ సిరీస్ ముగియగానే దుబాయ్‌కు బయలుదేరి ఐపీఎల్లో పాల్గొంటారు.
ఈ నేపథ్యంలో క్వారంటైన్లో ఉండి బయో బబుల్‌లో మ్యాచులు ఆడి కూడా మళ్లీ సదరు ఆటగాళ్లు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదన్నాడు సంజీవ్. స్టార్ ప్లేయర్లు ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా), మొయిన్ అలీ(ఇంగ్లాండ్) ఐపీఎల్లో మొదటి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటారని తెలిపాడు. దీనిపై స్పందించిన మిగతా ఫ్రాంచైజీలు.. సంజీవ్ వ్యాఖ్యలు బీసీసీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని.. ప్రతి ఆటగాడు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశాయి.