తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - chennai super kings

చెన్నై  సూపర్ కింగ్స్​​తో జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్

By

Published : May 5, 2019, 4:13 PM IST

Updated : May 5, 2019, 4:22 PM IST

మొహాలీ వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​తో.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనుంది. గెలుపుతో సీజన్​ను ముగించాలని ఇరుజట్లు భావిస్తాన్నాయి. మొదటగా టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై జట్టు చివరి స్థానంలో ఉన్న పంజాబ్​తో తుదిపోరులో తలపడనుంది. ఈ మ్యాచ్​లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది పంజాబ్.

పిచ్ బ్యాట్స్​మెన్​కు సహకరించే అవకాశం ఉంది. మొదటి ఇన్నింగ్స్​లో వేడి కారణంగా పిచ్ కాస్త స్లోగా ఉండనుంది. స్పిన్ కంటే పేసర్లకే సహకరించొచ్చు.

చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. పంజాబ్ ఓ మార్పు చేసింది.

జట్లు
చెన్నై సూపర్ కింగ్స్

ధోని (సారథి), డుప్లెసిస్, వాట్సన్, రైనా, రాయుడు, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, బ్రావో, దీపక్ చాహర్, హార్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రవిచంద్రన్ అశ్విన్ (సారథి), గేల్, రాహుల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, మన్​దీప్ సింగ్, సామ్ కరన్, హర్​ప్రీత్ బ్రర్, ఆండ్రూ టై, మురుగన్ అశ్విన్, షమి

Last Updated : May 5, 2019, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details