తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్​ గెలిచిన పంజాబ్​.. హైదరాబాద్​కు బ్యాటింగ్ - kings elavan punjab

కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​తో జరుగుతున్న మ్యాచ్​లో టాస్​ ఓడిన సన్​రైజర్స్ హైదరాబాద్ ​బ్యాటింగ్​కు దిగనుంది​. జట్టులో మూడు మార్పులు చేసింది సన్​రైజర్స్​. రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది​ పంజాబ్.

ఐపీఎల్

By

Published : Apr 29, 2019, 7:54 PM IST

సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరుగుతున్న మ్యాచ్​లో టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకుంది పంజాబ్​ కింగ్స్​ ఎలెవెన్​. హైదరాబాద్​ వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతోంది. ప్లేఆఫ్​ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్​ గెలవడం రెండు జట్లకు చాలా ముఖ్యం.

వార్నర్​కు ఈ సీజన్​లో ఇదే చివరి మ్యాచ్.

పదకొండు మ్యాచ్​లాడిన ఇరుజట్లు చెరో పదిపాయింట్లతో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నాలుగులో ఉండగా, పంజాబ్​ ఐదో స్థానంలో ఉంది.

ఇంతకుముందు ఇరుజట్లు తలపడిన మ్యాచ్​లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది సన్​రైజర్స్.

జట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది సన్​రైజర్స్. అభిషేక్, నబి, సందీప్ శర్మ జట్టులో చోటు సంపాదించారు. పంజాబ్ జట్టులో సిమ్రన్ సింగ్ తొలి ఐపీఎల్​ మ్యాచ్​ ఆడనుండగా... ముజిబుర్ రెహమన్ తిరిగి జట్టులో చోటు సంపాదించాడు.

జట్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్

అశ్విన్ (సారథి), రాహుల్, గేల్, మయాంక్ అగర్వాల్, మిల్లర్, నికోలస్ పూరన్, ముజిబుర్ రెహమన్, మహ్మద్ షమి, మురుగన్ అశ్విన్, ప్రభ్ సిమ్రన్ సింగ్, అర్షదీప్ సింగ్

సన్​రైజర్స్ హైదరాబాద్
విలియమ్సన్ (సారథి), వార్నర్, మనీష్ పాండే, విజయ్ శంకర్, మొహమ్మద్ నబీ, వృద్ధిమాన్​ సాహా, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ

ABOUT THE AUTHOR

...view details