తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాణించిన రైనా, డుప్లెసిస్.. పంజాబ్ లక్ష్యం 171

మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో జరుగుతున్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. డుప్లెసిస్, రైనా అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.

ఐపీఎల్

By

Published : May 5, 2019, 5:45 PM IST

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. తొలుత 30 పరుగుల వద్ద వాట్సన్ వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన రైనాతో కలిసి డుప్లెసిస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

వీరిద్దరూ పంజాబ్ బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తూ పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే డుప్లెసిస్ 37 బంతుల్లో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. మరోవైపు రైనా కూడా ధాటిగా ఆడాడు. కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. దీంతో 120 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం ధాటిగా ఆడిన డుప్లెసిస్ సెంచరీకి చేరువయ్యాడు. కానీ సామ్ కరమ్ వేసిన అద్భుత బంతికి 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. కొద్దిలో శతకం చేజార్చుకున్నాడు. అనంతరం వచ్చిన రాయుడు (1), కేదార్ జాదవ్ (0) విఫలమయ్యారు.

పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. షమీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details