మైదానంలో షారుక్ ఖాన్ సిక్సులు కొడుతూ కనిపించాడు. అవును మీరు విన్నది నిజమే, కానీ ఇక్కడ ఉన్నది హీరో షారుక్ కాదు క్రికెటర్ షారుక్. తన పేరుతో అందరి దృష్టిని ఆకర్షించిన ఇతడు.. ఇప్పుడు మైదానంలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతడు బ్యాటింగ్ చేస్తున్న వీడియోను పంజాబ్ కింగ్స్ ట్వీట్ చేసింది. కింగ్ ఖాన్ అంటూ అందులో రాసుకొచ్చింది.
మైదానంలో సిక్సులు కొడుతున్న షారుక్‌ఖాన్ - క్రికెట్ న్యూస్
ఐపీఎల్లో తొలిసారి ఆడబోతున్న పంజాబ్ బ్యాట్స్‌మన్ షారుక్ ఖాన్.. తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్నాడు. ఆ వీడియోను జట్టు ట్విట్టర్లో పంచుకుంది.
![మైదానంలో సిక్సులు కొడుతున్న షారుక్‌ఖాన్ Punjab Kings Show Off Shahrukh Khan's Six-Hitting Prowess](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11279415-770-11279415-1617550501832.jpg)
మైదానంలో సిక్సులు కొడుతున్న షారుక్‌ఖాన్
ఫిబ్రవరిలో జరిగిన వేలంలో షారుక్‌ఖాన్‌ను పంజాబ్, రూ.5.25 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇతడితో పాటు రిచర్డ్సన్(రూ.14 కోట్లు), మెరిడిత్(రూ.8 కోట్లు), డేవిడ్ మలన్(రూ.1.5 కోట్లు), హెన్సిక్స్(రూ.4.2 కోట్లు), జలజ్ సక్సేనా, సౌరభ్ కుమార్, ఉత్కర్ష్ సింగ్‌లను వేలంలో దక్కించుకుంది.
కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్న పంజాబ్ కింగ్స్.. ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 12న ఆడనుంది.