తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈరోజు నాకెంతో ప్రత్యేకం: పుజారా - అంతర్జాతీయ క్రికెట్​లో పుజారాకు పదేళ్లు పూర్తి

భారత జట్టు టెస్టు స్పెషలిస్ట్ చెతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టి నేటితో పదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా తన మద్దతుదారులకు, అభిమానులకు సోషల్​మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు.

Pujara thanks fans for love and support on completing 10 Years in international cricket
టెస్టు స్పెషలిస్టు క్రికెట్​ ప్రయాణానికి పదేళ్లు పూర్తి

By

Published : Oct 9, 2020, 9:33 PM IST

టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్ట్ చెతేశ్వర్​ పుజారా అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టి నేటితో పదేళ్లు పూర్తయ్యింది. టెస్టు ఫార్మాట్​లో జాతీయ జట్టు విశ్వసనీయ బ్యాట్స్​మన్​గా ఎదగడానికి సహకరించిన వారికి, అతని అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.

పుజారా ట్వీట్​

"భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకోవడం విశేషంగా, నాకు దక్కిన ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా తండ్రి కళ్లెదుట రాజ్​కోట్​లో సాధారణ క్రికెటర్​గా నేను ప్రారంభించిన ప్రయాణం నన్ను ఈ స్థాయికి తెస్తుందని ఊహించలేదు. ఇన్నాళ్లు నాకు మద్దతుగా ఉన్నవారికి, నా అభిమానులకు ధన్యవాదాలు. మీరంతా నాకు మరింత సహకారాన్ని అందిస్తారని ఎదురుచూస్తున్నా."

- చెతేశ్వర్​ పుజారా, టీమ్​ఇండియా క్రికెటర్

ఈ తేదీని గుర్తుంచుకోవడానికి మరొక కారణాన్ని తెలియజేస్తూ ఓ నోట్​ ద్వారా తెలిపాడు పుజారా. "ఆశ్చర్యం ఏమిటంటే ఈ రోజు నా భార్య పుట్టినరోజు. కాబట్టి ఈ రోజును నేనెప్పటికీ మర్చిపోలేను" అని పేర్కొన్నాడు.

బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు పుజారా. ఈ మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో 72 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2018లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో 500 వ్యక్తిగత పరుగులు చేసి మూడు టెస్టుల సిరీస్​లో భారత్(2-1)​ గెలుపునకు సహకరించాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్​లో ఇప్పటివరకు 77 మ్యాచ్​లు ఆడిన పుజారా.. 18 సెంచరీలతో 5,840 పరుగులు సాధించాడు.

ABOUT THE AUTHOR

...view details