టీమిండియాకు చెందిన చతేశ్వర్ పుజారా.. తాను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన టెస్టు బ్యాట్స్‌మన్ అని చెప్పాడు ప్రపంచ నంబర్.1 బౌలర్ ప్యాట్ కమిన్స్. క్రీజులో ఉంటే అతడ్ని ఔట్ చేయడం చాలా కష్టమని, తమకు తలనొప్పిగా మారతాడని అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని వెల్లడించాడు.
'అతడు క్రీజులో ఉంటే మాకు తలనొప్పి తప్పదు' - కమిన్స్ క్రీజులో ఉంటే కష్టమని చెప్పిన కమిన్స్
టెస్టుల్లో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరో చెప్పాడు ఆసీస్ బౌలర్ కమిన్స్. అతడు క్రీజులో ఉంటే తమ జట్టుకు తలనొప్పి తప్పదని, ఔట్ చేయడం చాలా కష్టమని అన్నాడు.
కమిన్స్ పుజారా
"ఎంతోమంది బ్యాట్స్‌మెన్‌ను చూశాను. అందరిలోనూ డిఫరెంట్ అంటే పుజారానే. అతడు క్రీజులో ఉంటే మాకు తలనొప్పి తప్పదు. ఎంతో ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తాడు. ప్రస్తుత టెస్టు క్రికెట్లో అతడో గొప్ప ఆటగాడు" -ప్యాట్ కమిన్స్, ఆసీస్ బౌలర్
2018-19లో ఆస్ట్రేలియాలో పర్యటించిన కోహ్లీసేన.. 71 ఏళ్ల చరిత్రలో కంగారూ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇందులో అద్భుతంగా ఆడిన పుజారా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.