తెలంగాణ

telangana

ETV Bharat / sports

పుజారా@6000.. పంత్ సెంచరీ మిస్ - భారత్-ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టు అప్​డేట్స్

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో పుజారా 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అలాగే యువ క్రికెటర్ పంత్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

Pujara, pant
పంత్, పుజారా

By

Published : Jan 11, 2021, 9:02 AM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా అర్ధశతకం (52*) సాధించాడు. అలాగే స్టార్క్‌ వేసిన 73వ ఓవర్‌లో సింగిల్‌ తీసిన అతడు టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 11వ భారత క్రికెటర్ పుజారా.

ఇప్పటివరకు పుజారా మొత్తం 80 మ్యాచ్‌ల్లో 134 ఇన్నింగ్స్‌లు ఆడి 26 అర్ధశతకాలు, 18 శతకాలు చేశాడు. 2012లో ఇంగ్లాండ్‌పై ఓ టెస్టులో 206*అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించాడు.

పంత్ సెంచరీ మిస్..

భోజన విరామం తర్వాత ధాటిగా ఆడిన పంత్‌(97) తృటిలో శతకం కోల్పోయాడు. లియోన్‌ వేసిన 80వ ఓవర్‌లో షాట్‌ ఆడబోయి గల్లీ పాయింట్‌లో కమిన్స్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 250 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. అంతకుముందు పుజారాతో కలిసి పంత్‌ 148 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. ఇక పంత్‌ ఔటయ్యాక విహారి క్రీజులోకి వచ్చాడు.

టీ బ్రేక్

మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ సమయానికి టీమ్‌ఇండియా 84 ఓవర్లకు 262/4తో నిలిచింది. భారత్‌ విజయానికి ఇంకా 145 పరుగులు అవసరం.

ABOUT THE AUTHOR

...view details