కరోనా కారణంగా వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ను విధించారు. ఇళ్ల నుంచి బయట అడుగుపెట్టొదంటూ సూచనలు ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఓ ఫొటోను పోస్ట్ చేసిన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోని ఇస్లామాబాద్ జట్టు.. నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ గురవుతోంది.
బుమ్రా నోబాల్ ఫొటో పోస్ట్.. పాక్ జట్టుపై ట్రోలింగ్ - troll on pakisthan team
టీమిండియా పేసర్ బుమ్రా నోబాల్ ఫొటోను పోస్ట్ చేసిన పాక్ దేశీయ జట్టుపై ట్రోలింగ్‌కు దిగారు పలువురు నెటిజన్లు. గతంలో దాయది క్రికెటర్లు చేసిన తప్పుల్ని ఎత్తిచూపుతు పోస్ట్‌లు పెడుతున్నారు.
బుమ్రా నోబాల్ ఫొటో
ఏం జరిగింది?
గతంలో ఓ మ్యాచ్‌లో బుమ్రా వేసిన నోబాల్ ఫొటోను పోస్ట్ చేసిందీ జట్టు. అవసరమైతే తప్ప ఇంటిని వీడొద్దని, మనుషుల మధ్య దూరం పాటించాలని రాసుకొచ్చింది. అయితే దీనిని రీట్వీట్ చేసిన కొందరు నెటిజన్లు.. గతంలో పాకిస్థాన్ క్రికెటర్లు చేసిన తప్పులు ఎత్తిచూపుతూ పోస్టులు చేశారు. ఇవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.